నేను బి.ఎడ్ చేసే సమయంలో ఒక క్రిష్టియన్ పాఠశాలలో టీచింగ్ ప్రాక్టీసు
చెయ్యవలసి వచ్చింది. అక్కడ పనిలో పనిగా ఆ పాఠశాలలో పనిచేసే ఒక టీచర్
పరిచయం అయ్యింది. ఒక సారి చర్చలో కృష్ణుడు 16000మంది స్త్రీలను ఎందుకు
పెండ్లాడాడు ? అంత రసికుడినా మీరు పూజించేది అని ఆ టీచర్ ఎద్దేవా చేసింది.
నాతోపాటు ఉన్న హిందూ మిత్రులంతా తెల్లమొఖం వేసారు. అవును కదా ... అని ఆ
టీచర్ తో ఏకీభవించబోయారు.... ఇంతలో నాకు చిన్నప్పుడు నేర్చకున్న పై
ప్రశ్నకు సమాధానం స్పురించింది. వెంటనే వారికి ఈ విధంగా సమాధానం
చెప్పాను... అదే మీ ముందుంచుతున్నాను...
" నరకాసురుడు అనే
రాక్షసుడు 16000మంది స్త్రీలను చెరబట్టి తన చెరసాలలో భందించాడు. అప్పుడు
కృష్ణుడు నరకాసురుని చంపి ఆ స్త్రీలందరిని ఆ చెరనుండి విడిపించాడు. అయితే
పరపురుషుని చెరలో ఉండి బయటకు వచ్చిన స్త్రీలందరు తమకు సమాజంలో ఎటువంటి
విలువ ఉండదని, తమను సమాజం చిన్నచూపు చూస్తుందని, తమకు పెళ్ళిళ్ళు కావని,
తమకు చావే శరణ్యం అని కష్ణునితో మొరపెట్టుకున్నారు.
అపుడు కృష్ణుడు వారికి సమాజం నుండి వచ్చే చిన్నచూపు నుండి రక్షించడానికి, వారికి సోషల్ స్టేటస్
ను కల్పించడానికి వారినందరిని పెండ్లాడి పట్టపు రాణులుగా చేసుకున్నాడు.
ఇందులో కృష్ణుడు చేసిన త్యాగం ఉంది కానీ అతని స్వార్థం లేదు. " అని
ఆవేశంగా చెప్పి ముగించాను. అంతే ఆ మరుక్షణం ఆ టీచర్ అక్కడి నుండి
అదృష్యమయ్యింది. నా మిత్రలందరూ నన్ను అభినందించారు.
హరిసేవ
లో దుర్గేశ్వర గారు రామాయణం గురించి వ్రాసిన విధానం, విశ్లేషణ చే
ప్రభావితమై ఇది రాస్తున్నాను. హిందువులై ఉండి కూడా భిన్నంగా ఆలోచించాలి
అనే విచిత్రమైన పోకడలతో సరియైన విధంగా హిందుత్వాన్ని, ఇతిహాసాల్ని
అర్థంచేసుకోక విచిత్రమైన వాదనలతో హిందువులలోనే సందేహాలు రేకెత్తించే
విధంగా కొందరు వాదిస్తున్నారు. మన ఇతిహాసాల్లో గల ప్రతి సంఘటనకు ఒక
విష్లేషణ ఉంటుంది అది సూక్ష్మంగా ఆలోచిస్తేనే తెలుస్తుంది.
By : Varma sir_English
U R good Right?,so Enter u r Name.
ss
Saturday, March 20, 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment