అప్రతిభ ప్రతిభ
1934 డిసెంబర్ 19న జన్మించిన ప్రతిభాపాటిల్ ప్రపంచంలోనే అతి పెద్ద గణతంత్ర దేశానికి నాయకత్వం వహిస్తున్న మొట్టమొదటి మహిళ. జులై 25, 2007లో ఎ.వి.పి.జె అబ్దుల్ కలాం నుంచి దేశాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్.ఎస్.సి. చేసి 'లా'లో డిగ్రీ పుచ్చుకున్న తర్వాత 1926లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరారు పాటిల్. (1962-85)లో మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా ఎద్లాబాద్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత అమరావతి నియోజక వర్గం నుంచి 1991లో లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004లో రాజస్తాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్ పదవికి ఎన్నికైన మొట్టమొదటి మహిళ ఆమే!
విద్యావేత్తగా: 1965లో ప్రముఖ విద్యావేత్త దేవిసింగ్ రామ్‌సింగ్ షెకావత్‌ను వివాహం చేసుకున్నారు. భర్తతో కలిసి విద్యా భారతి శిక్షణ ప్రసారక్ మండలి పేరుతో జల్‌గావ్ జిల్లాలో ఎన్నో స్కూళ్లు, కాలేజీలు నిర్వహిస్తున్నారు. అంతేకాక శ్రమ సాధన ట్రస్ట్ పేరుతో ఢిల్లిd పూణ ముంబైలలో ఉద్యోగినుల కోసం హాస్టళ్ళు జల్‌గావ్‌లో, ఓ ఇంజనీరింగ్ కాలేజిని ఏర్పాటు చేసారు. సంత్ ముక్తాబాయి సహకారీ షక్కర్ కార్ఖానా పేరుతో ఓ చక్కెర ఫ్యాక్టరీని స్థాపించడమే కాక ప్రతిభా మహిళా సహకారా బ్యాంక్ పేరులో సహకార బ్యాంకును ఏర్పాటు చేశారు.
రాజకీయ వేత్తగా: 1967లో వసంతరావు నాయక్ మంత్రి వర్గం విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. తర్వాత పర్యాటక, సాంఘిక సంక్షేమం, గృహనిర్మాణం శాఖలను నిర్వహించారు. 1985లో ఎద్లాబాద్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత 1986-88 వరకు రాజ్యసభ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో రాజస్థాన్ గవర్నర్‌గా నియమితులయ్యారు 2006లో రాజస్థాన్ ధర్మ స్వతంత్య్ర బిల్ (ఫ్రీడమ్ ఆఫ్ రిలీజస్ బిల్)ను పాస్ చేశారు. మత మార్పిడులను నిరోధించడమే ఈ చట్టం ముఖ్యోద్దేశం. 2007లో రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడాల్సి రావడంతో గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.
మాననీయ సోనియా
రాజీవ్‌గాంధీ భార్యగా, ఇందిరాగాంధీ కోడలిగా కాకుండా తనకంటూ ఉనికి కల్పించుకున్నారు సోనియాగాంధీ. అవును మరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలిగా తన దక్షతను, సామర్థ్యాన్ని చాటుకుంటూ లక్షలాదిమంది అభిమానాన్ని చూరగొంటున్నారు.
స్టీఫెనో, పావ్‌లా మైనో దంపతులకు 1946 డిసెంబర్ 9న ఇటలీలోని లూసియానాలో పుట్టిన సోనియా కేంబ్రిడ్జిలో చదువుకున్నారు. అక్కడే ఆమెకి రాజీవ్‌గాంధీతో పరిచయం ఏర్పడింది. అది ప్రణయంగా మారి, ఆపైన పరిణయానికి దారితీసింది. 1968లో రాజీవ్‌గాంధీతో పెళ్ళయ్యాక అత్తగారు, అప్పటి దేశ ప్రధాని అయిన ఇందిరాగాంధీ ఇంట్లో అడుగుపెట్టారు. వారి పిల్లలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు. సోనియా ఇంటి బాధ్యతలు చూసుకోగా, రాజీవ్ పైలట్‌గా చేసేవారు. ఇద్దరూ చాలాకాలం రాజకీయాలతో సంబంధం లేకుండా జీవించారు. ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు కొంతకాలం విదేశాల్లో గడిపారు. 1980లో సోదరుడు సంజయ్‌గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయిన తర్వాత 1982లో రాజీవ్‌గాంధీ రాజకీయాల్లో ప్రవేశించారు. మొదట ఇందిరాగాంధీ కోడలిగా, తర్వాత ప్రధాని రాజీవ్‌గాంధీ భార్యగా ఆమె ప్రజలకు సుపరిచితురాలు. భర్త మరణం తర్వాత ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తిరస్కరించారు.తర్వాత కూడా చాలాకాలం ఆమె రాజకీయాలపట్ల మొగ్గు చూపలేదు. ఏమైతేనేం, 1998లో భారత జాతీయ కాంగ్రెస్‌కి అధ్యక్షురాలయ్యారు. అంతేకాదు, ఆమె యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్‌కు ఛైర్‌పర్సన్‌గా కూడా సేవలందిస్తున్నారు.
ఇప్పుడు సోనియాగాంధీ ఒక వ్యక్తి కాదు, మహాద్భుత శక్తి అనిపించుకుంటోంది. కీలకమైన నిర్ణయాలతో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ భేష్ అనిపించుకుంటున్నారు. 2004లో ఫోర్బ్స్ మాగజైన్ జరిపిన సర్వేలో ప్రపంచంలో మూడో శక్తిమంతమైన మహిళగా నిలిచారు. 2007లో 6వ ర్యాంకు సాధించారు. తమ ప్రతిభతో గొప్పగా ప్రభావితం చేస్తోన్న 100మంది ప్రపంచమహిళల్లో ఒకరిగానూ ఉన్నారు.
నిర్వహణ శక్తి పెరగాలి
ఆర్థిక స్వావలంబన ద్వారానే మహిళా జాగృతి సాధ్యం. నిర్వహణ సామర్థ్యానికి సానబట్టినప్పుడే స్త్రీశక్తి వెలుగుచూస్తుంది. దీనికోసం ఇంకా కృషి జరగాలి. ఇంకెంతో ఆత్మస్థైర్యం పెంపొందాలి. ఉద్యోగం, ఉపాధి రంగాల్లో రాణిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. కానీ సంపాదనను భర్త చేతుల్లో పెట్టే సంస్కృతి మాత్రం మారడం లేదు. కుటుంబ నిర్వహణలో తానే కీలకమైతే పరిస్థితిలో ఇంకెంతో మార్పు ఉంటుంది. తాను మహిళను అనే మాట పక్కన పెట్టాలి. ఏదైనా చేయగలను అనే విశ్వాసం పెంచుకోవాలి. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహమూ అవసరం. నానాటికి మహిళల పట్ల హింస పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణంగా నిరక్షరాస్యత. ఆడపిల్ల కదా! ఏదో మామూలు డిగ్రీ కోర్సులో చేరిస్తే పోలా...? అనే ధోరణి మారాలి. నిజానికి విద్య అంటే కేవలం డిగ్రీ తీసుకోవడమే కాదు. సమాజాన్ని అధ్యయనం చేయడం. ఈ కసరత్తులో మహిళలు మరింత ముందుండాలి. పరిశ్రమలు స్థాపించాలి. ఉపాధి రంగాలను చేతుల్లోకి తీసుకోవాలి. ఇన్నేళ్ళ పోరాటం ఫలితంగా 33 శాతం రిజర్వేషన్ సాధించబోతున్నాం. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. పోలీసుశాఖలోనూ ఈ దిశగా అడుగులు పడాలి. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. పోలీసు విభాగంలో మహిళల సంఖ్య పెంచేందుకు అవసరమైన కృషి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అంతేకాదు వ్యాపార, వాణిజ్య రంగాల్లోనూ ఈ ఒరవడి సాగిపోవాలి. అప్పుడే 'మహిళా దినోత్సవం'కు సార్థకత ఉంటుంది.
మమత బెనర్జీ
బెంగాలీలు 'దీదీ' అని ఆప్యాయంగా పిలిచుకునే మమతాబెనర్జీ ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రైల్వేమంత్రిగా ఉన్నారు.
1955 లో పశ్చిమ బెంగాల్‌లో కొల్‌కతాలోని జన్మించిన ఆమె వజ్రా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 'లా' చేసిన మమత 1970 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతి తక్కువకాలంలోనే పశ్చిమబోంగాల్ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1984 ఎన్నికలో ప్రముఖ సిపిఐ నేత సోమ్‌నాథ్ ఛటర్జీని ఓడించి అతిచిన్న వయసులోనే లోక్‌సభకు ఎన్నికైన మహిళగా రికార్డు సృష్టించారు. 1989 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో సభ్యత్వానికి రాజీనామాచేసారు. మళ్లీ 1991 లో దక్షిణ కోల్‌కత్తా నియోజిక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. తరువాత అక్కడినుంచే వరుసగా 1996, 1998, 1999, 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో విజయంసాధించారు.
1991 లో పి.వి.నరసింహరావు ప్రభుత్వంలో మానవవనరులు యువజన క్రీడాశాఖ మంత్రిగాను మంచిగా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసారు. కానీ ప్రభుత్వవిధానాలను నిరసిస్తూ 1993 లో పదవికి రాజీనామా చేశారు. 1996 లో, 1997 లో కాంగ్రెస్ లోంచి బయటికి వచ్చి అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. పశ్చిమ బోంగాల్‌లో ఎంతో ఘనమైన రాజకీయ చరిత్రఉన్న వామపక్షాలకు దీటుగా నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్. 1999లో బిజెపి నేతృత్వంలో ఏర్పాటైన ఎన్.డి.ఎతో పొత్తు కుదుర్చుకుని రైల్వే మంత్రిగా పదవీ బాధ్యత స్వీకరించారు. 2000 సంవత్సరంలో రైల్వే మంత్రిగారు మొట్ట మొదటిసారిగా రైల్వే బడ్జెట్ సమర్పించారు. ఇందులో భాగంగా పర్యాటకులను ఆకర్షించడానికి ఎన్నో పథకాలను ప్రారంభించారు. 2001 లో బి.జె.పిలో విభేదాల కారణంగా పదవికి రాజినీమా చేసారు. 2001 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నారు. 2004 ఎన్నికల్లో తృణమూల్ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యి గనులు, ఖనిజాల మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేసారు. 2005 లో పశ్చిమ బెంగాల్‌లో బుద్దదేవ్ భట్టాచార్య ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామీకరణ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. అదే ఏడాది కోల్‌కత్తా మునిసిపాలిటీపై పట్టుకోల్పోయారు. 2006 లో శాసన సభ ఎన్నికలో ఓటమి చవిచూసింది తృణమూల్ పార్టీ. 2009 లో యుపిఎతో పొత్తు కుదుర్చుకుని ప్రస్తుతం రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లుపై తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. 2009 బెంగాల్ శాసనసభల ఎన్నికల్లో కాంగ్రెస్ -టి.ఎం.సిలు సంయుక్తంగా 26 సీట్లను చేజిక్కించుకున్నాయి.
పెట్టిపోయలేని వట్టి నరులు భూమిఁ
పుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనఁ జెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ!
సహాయపడనివారు పుట్టినా, చచ్చినా ఒకటే. చెదపుట్టలో చెదపురుగులు పుట్టవా, చావవా, అని అంటారు యోగి వేమన!
కరుణ చూపిన పక్షి:
ఓ అడవిలో ఓ పెద్ద చెట్టుమీద కొన్ని పక్షులు గూళ్లు కట్టుకొని నివసిస్తున్నాయి. ఆ చెట్టు పెద్ద కొమ్మకు రెండు రకాల పక్షులు రెండు గూళ్ళల్లో పిల్లల్ని ముద్దుగా పెంచుకుంటున్నాయి. రాత్రంతా ఆ రెండు పక్షులూ పిల్లల చెంత వెచ్చగా పడుకొని నిద్రపోయి తెల్లవారగానే తమ పిల్లలకు ఆహారం కోసం దూరంగా అడవిలోకి వెళ్లిపోయేవి. ఆ రెండు పక్షి గూళ్లల్లోనూ ఒక్కోదాంట్లో మూడేసి పక్షిపిల్లలు కిచకిచమని అరుచుకుంటూ తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురుచూస్తూ వుండేవి.
ఒకరోజు ఆ రెండు రకాల పక్షులు అడవిలోనికి ఆహా రం కోసం వెళ్లిపోయాయి. ఒక పక్షి మాత్రం దొరికిన రక రకాల పురుగుల్ని ముక్కున కరుచుకుని తమ పిల్లల కోసం గూటిదగ్గరకి చేరింది. ఆ పక్షి తల్లి తెచ్చిన ఆహారం చూడ గానే, ఆకలిగా పక్షిపిల్లలు కిచకిచ అని అరవడం మొద లెట్టాయి.కొన్ని పురుగుల్ని పక్కనబెట్టి, తెచ్చిన పురుగుల్ని తన పిల్లలకు ఆహారంగా అందించింది. కానీ, ఆ పక్కనే వున్న మరోపక్షి గూటిలోని పిల్లలు ఆకలితో అరుస్తూ, తల్లి రాక కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ, ఆ పిల్లల తల్లి పొద్దుపో యినా తిరిగి తన గూటికి రాకపోయేసరికి, ఆ పక్షి పిల్లలు తల్లి పక్షి రాలేదన్న బెంగతో మరింత గట్టిగా అరవడం మొదలు పెట్టాయి. ఆ గూటి పక్షిపిల్లలు ఆకలికి తాళలేక అరచి అరచి సొమ్మసిల్లిపోయినాయి.
అదంతా గమనించిన పక్కగూటి పక్షి వాటికేసి జాలిగా చూసింది. తను దాచిపెట్టిన పురుగుల్ని ఆహారంగా ఇచ్చి, ఆకలి తీరుద్దామని అనుకొంది. వెంటనే ముక్కుతో ఆ పురుగుల్ని పట్టుకొని, ఆ పక్షిపిల్లలకి అందించింది. ఆ పక్షిపిల్లలు ఆకలికి గబ గబా ఆ పురుగుల్ని తినేసి సంతోషంగా ఆ పక్షికేసి చూశాయి. ఆ పక్షి కూడా వాటిని ప్రేమతో,ముక్కుతో వాటిని ముద్దాడింది. ఆ పిల్లల తల్లి ఏ ఆపదలోనో మరణించి వుంటుందని గ్రహించింది. ఆ పక్షి పిల్లల తల్లి రాత్రయినా గూటికి రాకపోయేసరికి వాటిదగ్గరే ఈ పక్షి కాసేపు పడుకుంది. ఆ పక్షిపిల్లలు ఈ పక్షినితల్లిగా భావించి పడుకున్నాయి. ఈ పక్షి అది గమనించి కరుణతో వాటికీ రోజూ ఆహారాన్ని అందిస్తూ వాటితో ప్రేమగా వుం టూ మెలగసాగింది. అలాగ ఎంతో ఓర్పుతో, ప్రేమతో ఆ పక్షిపిల్లల్నీ పెద్దవాటిగా చేసింది.
చూశారా బాలలూ! తల్లి లేక తల్లడిల్లిపోయే ఆ పక్షి పిల్లల ఆకలిని మరో తల్లి పక్షి గ్రహించి చేరదీసింది. ఆకలి తో అలమటించకుండా వాటికీ ఎంతో కరుణతో, ప్రేమతో ఆహారాన్ని తెచ్చిపెట్టి మరీ తన పిల్లలలాగానే పెంచి పెద్ద చేసింది. అలాగే మానవులైన మనము కూడా తోటివారిమీద కరుణ కలిగి వుండటమే దైవగుణం అన్న విషయాన్ని తెలుసుకొన్నారుగా బాలలూ!
-ఎస్. తులసీరామాచారి
ఆమె.. ఆమే! అనవరాతాను కంపాయుత మనస్విని. సతత వ్రత తపస్విని. పతివ్రతా యశస్విని. ప్రేమానంద పయస్విని. జనని. ఆమె!
ఆమె.. చతుర్దశ భువనాలవాల. దుర్దాంతాభీల. నవరస డోల. కరుణాలవాల. నయగారాల బాల. సరస శృంగార రసహేల. సురుచిర సిందూరఫాల. నిరుపమ సౌందర్య జాల.. శీలగుణ జ్వాల... అంచేతే,
కార్యేషు దాసీ.. కరణషు మంత్రీ..
రూపేచ లక్ష్మీ.. క్షమయా ధరిత్రీ..
భోజ్యేషు మాతా.. శయనేషు రంభా..
షట్‌ధర్మయుక్తా.. కులధర్మ పత్నీ..
అలా.. అనాదిగా సర్వ జనాద రణీయగా, పండిత పామ రారాధనీయగా భాసిల్లు తూనే ఉంది.. స్త్రీ..
అయితే, అలనాటి సముదాయాల లోనూ, ఈనాటి సంఘంలో కూడా, దుర్యోదన, దుశ్శాసన, కీచకులని తలపింపచేసే పురుషులు సమాజంలో స్త్రీని వంచిస్తూనే ఉన్నారు. దాంతో, మగవారిలోని మంచితనం మరుగునపడిపోయి, వాళ్ళని కేవలం నయవంచకులుగా భావించే పరిస్థితి దాపురించింది. అయినా స్త్రీని గౌరవించే సమాజమే ఎప్పటికైనా వర్ధిల్లుతుందనే విషయం ముఖ్యంగా భారతీయులలో అణువణువునా జీర్ణించుకుపోయింది. అంచేత, నిజమైన సంస్కారానికీ, సంస్కృతికీ, నాగరికతకీ నిలయాలైన అన్ని సముదాయాలలోనూ స్త్రీని ఆది పరాశక్తిగా భావించి పూజించడం జరుగుతూనే ఉంది.
కాకపోతే, సమకాలీన సమాజంలో నానాటికీ పెచ్చు పెరిగిపోతున్న కుహనా రాజకీయాల వల్ల, కుటిల నీతుల వల్ల, హింసాత్మక ధోరణుల వల్ల, కాముకత వల్ల మహిళలు కౌటుంబిక హింసలకీ, అత్యాచారాలకీ, మానభంగాలకి గురికావడం జరుగుతోంది. ఏ కొద్దిమందో సంఘ విద్రోహక శక్తులు చేసే ఈ దురంతాలకి పురుష జాతిని మొత్తాన్ని నిందించడం సభ్యం కాదు.. సవ్యం కూడా కాదు. అసలు సమాజాన్ని నైతికంగా దిగజార్చే పురుషులైనా, స్త్రీలైనా శిక్షార్హులే! ఆర్ష ధర్మానుగుణమైన మనస్మృతీ, ఈనాటి ఆధునిక న్యాయశాస్త్రాలూ, చట్టాలు కూడా ఇదే విషయం పదే పదే ఘోషిస్తున్నాయి.
మహిళల దుర్దశలో...
భారతదేశంలో, మహిళల దారుణమైన, దయనీయమైన స్థితిగతుల గురించి అనుక్షణం ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు మనకి కళ్ళకు కట్టిస్తూనే ఉన్నాయి.. కళాశాలలలో ర్యాగింగ్, ఆఫీసుల్లో ఈవ్ టీజింగ్, ఆధ్యాత్మికత ముసుగులో పరమ గురువులు అని చెప్పుకునే కల్కి భగవాన్ వంటి పయోముఖ విషకుంభాలూ, పవిత్రమైన ఉపాధ్యాయవృత్తికి కూడా కళంకం ఆపాదిస్తూ పసిబాలికలను సైతం తమ కాముకత్వా నికి బలిచేస్తున్న మేకవన్నె పులులూ, ప్రజానీకాన్ని పరిరక్షించాల్సిన రక్షకభటులే అమాయక గ్రామీణ స్త్రీల మీద జరుపుతున్న అత్యాచారాలూ, ప్రాణాల్ని కాపాడాల్సిన వైద్య వృత్తి చేపట్టిన డాక్టర్లే స్త్రీల మానభంగాలకి పూనుకుంటున్నా దారుణాతిదారుణమైన సంఘటనలూ, నిస్సహాయులైన ప్రజల మనసుల్నీ, చట్టాలని తుచ తప్పకుండా పాటించే పౌరుల గుండెలను కూడా కలచివేస్తూనే ఉన్నాయి. అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయవ్యవస్థ కూడా వ్యవహరించే భారతదేశంలో ఈ నేరస్థులకి తక్షణమే శిక్షలు అమలు జరిపి ప్రజానీకానికి సౌదీ అరేబియా వంటి దేశాలలోలా పాపభీతి కలిగించే అవకాశమే లేదు. నిజానికి రుజువులూ, సాక్ష్యాలూ కొరవడడంతో నేరస్థులు హాయిగా, సగర్వంగా, స్వేచ్ఛగా నడివీధుల్లో విహ రించే రోజులివి... అలాగని ఈ దేశా నికి ప్రజాస్వామ్యం తగదనీ, నియంతృ త్వమో, నిరంకుశ త్వమో, సైన్య ప్రభుత్వమో కావాలని అనుకోవడం కూడా సక్రమం కాదు కదా? మరి విచ్ఛలవిడిగా సంఘంలో జరుగు తున్న ఈ అకృత్యాల నుంచీ, అరాచకాల నుంచీ, అమాయక ప్రజలకీ, ముఖ్యంగా స్త్రీలకీ, నిష్కృతి ఎలా లభిస్తుంది?
ఇలా, స్త్రీల పట్ల అశ్లిdలతా, అసభ్యతా, అన్ని ప్రాంతాలలో చోటు చేసు కుంటూనే ఉంది. మరోవైపు ప్రాకృతికంగా స్త్రీ, పురుషుల సంఖ్యా బలంలోని అసంతులనత కూడా మానవ సమా జాన్ని భీతావహం చేస్తూనే ఉంది. భారత దేశంలోనే అత్యంత సంపన్నమైన పంజాబ్ రాష్ట్రంలో నానాటికీ స్త్రీల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. దాంతో ఆ రాష్ట్రంలో బహుబర్తృత్వం, అనివార్య మన ఆచారంగా పరిణమించే పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపు వంద సంవత్సరాల క్రితం ఇదే స్త్రీ, పురుషుల అసంతులనత వల్ల భారతీయ సమాజంలో కన్యాశుల్యం చోటు చేసుకుంది. ఆ తర్వాత పురుషుల సంఖ్య నానాటికీ తగ్గిపోవడంతో, వరులకీ సమాజంలో అనూహ్యమైన గిరాకీ ఏర్పడి వరకట్న దుర్‌వ్య వస్థ సమాజం మొత్తాన్నీ కబళించే పరిస్థితి ఏర్పడింది. అంటే కాలచక్ర గమనంలో ప్రాకృ తికమైన అసంతు లనల వల్ల ఇలాంటి విప రీతాలు దాపురిస్తున్నాయని మనం తెలుసు కోవాలి.
మనలని పాశవికతకి చిహ్నంగా మనం మహిళలను భావించాలి. దైహికంగా పురుషులకు బలం ఎక్కువే! అయితే మానసిక శక్తి విషయంలో స్త్రీని ఏనాడూ పురుషుడు అధిగమించలేడనేది నిర్వివాదమైన అంశం. అంచేత స్త్రీని ఏ రూపంలోనైనా అణచివేసే పరిస్థితి ఏర్పడితే సమాజమే ఛిన్నాభిన్నమై బలహీనమై పోతుందని అందరికీ తెలుసు. 2007లో యునెస్కాప్ జరిపిన ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఏషియా సర్వే నివేదికలో కూడా మహిళల పాత్ర సంఘంలో ఎంతో ముఖ్యమని చెప్పడం జరిగింది.
మన జీడీపీ నానాటికీ పెరుగుతోంది. తద్వారా శ్రామికులకు కూడా తగినంతగా అన్నవస్త్రాలు లభిస్తున్నా యని ప్రభుత్వ గణాంకాలు తెలియచేసు ్తన్నాయి. కానీ, సమాజం నిజస్వరూపాన్ని పరికిస్తే ''మహిళా సంక్షేమానికి మనం ఎంతగా దోహదం చేస్తున్నాం?'' అనే ఆత్మ విమర్శ అనివార్యమైపోతోంది.
మనుస్మృతిలో...
ఏదేమైనా, మనుస్మృతి కూడా నిర్ద్వందంగా స్త్రీలను ఆరాధనీయులుగా భావించిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. ''ఇంటింటికీ అదృష్ట దేవతలుగా ఆత్మోన్నతి కలిగించే శోభాయమానమైన జ్యోతులుగా మానవ జాతి ధార్మిక జీవనంలో అంతర్భాగంగా భావించే స్త్రీలలోనే సిసలైన స్వర్గం కూడా అంతర్హితమై ఉంది. స్త్రీలను పూజించే, సన్మానించే ఇళ్ళలో సిరిసంపదలకేనాటికీ కొరత ఉండదు'' అని మనుస్మృతి నిర్ద్వందంగా ఘోషిస్తోంది.
అధర్వణ వేదంలో...
స్త్రీ, పురుషుడిని అన్ని విధాలా అధిగమిస్తుందని అధర్వణ వేదం స్పష్టంగా పేర్కొంది. సూర్యుడు ఛాయాదేవి తనమీద ప్రసరించిన తొలి కిరణాల వల్లే తను భాస్వంతుడిగా వెలుగొందుతున్నానని సాక్షాత్తూ సూర్యుడే భావించాడని అధర్వణ వేదం పేర్కొంటోంది.
శీల, మేధా సంపదల నిలయంగా...
''ఓ వధూరత్నమా! వేదాల లోని విజ్ఞానమంతా నీ ముందూ, నీ వెనకా, నీ మధ్యలో, నీ ఆద్యంతాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇంత ఘనురాలివైనా నువ్వు వినమ్రంగా ఉండడం వల్లే ఈ ప్రపంచమంతా ఆరోగ్యంగా, హాయిగా, హుందాగా మనగలుగుతోంది. నీ మేధ వల్లే ఈ సచరాచర సృష్టి సక్రమంగా జీవించగలుగుతోంది'' అంటోంది అధర్వణ వేదం.
అలాగే, ''సకల మంత్ర ప్రదాతవైనా నీవల్లే సమాజం సుఖశాంతు లతో వర్ధిల్లుతోంది. స్వపర బేధాలు లేకుండా అవ్యాజమైన ప్రేమతో నువ్వు వ్యవహరించడం వల్లే ఈ సమాజం క్షేమంగా మనుగడ సాగిస్తోంది'' అంటోంది రుగ్వేదం. అలా సకల వేదాలలో పరమపూజ్యురాలిగా భాసిల్లు తోంది స్త్రీ. అంచేతే సనాతన సంస్కృతికీ, సంప్రదాయాలకి నిలయమైన భారతదేశంలో పురాణతి హాస కాలంలో కూడా స్త్రీకి ప్రథమస్థానం ఇస్తూనే వచ్చారు. దేవతల దంపతులలో, మానవుల సంసా రాలలో కూడా మహిళదే మొదటిస్థానం. భార్యాభర్తలు, ఆలుమగలు, స్త్రీ పురుషులు, తల్లితండ్రులు వంటి ద్వంద సమాసాలు కూడా స్త్రీని గౌరవించే విధంగానే సహజంగానే అన్ని భాషలలోనూ రూపొందాయి. కనుక అనాదిగా స్త్రీ పురుషుడి నయవంచనకి గురైందని అనడం సవ్యం కాదు. అయితే ఆమెకి అడపాదడపా అన్యాయం జరగడం కూడా లేకపోలేదు.
యజ్ఞ యాగాదులలో...
''యజ్ఞ యాగాదులలోనైనా, పైతృక కర్మల్లోనైనా స్త్రీ అగ్నిహోత్రం. స్త్రీ సమిధ తీసుకువచ్చి ఇస్తే గానీ అగ్నిహోత్రం రాచేయకూడదనే నియమం ఉంది. ఒకవేళ ఆ సమయంలో పురుషుడు ఇంట్లో లేకపోతే స్త్రీకి స్వయంగా అగ్నిహోత్రం రాజేసి యజ్ఞం నిర్వహించే హక్కు కూడా ఉంది'' అంటోంది రుగ్వేదం. వీటివల్ల, వేదకాంలో కూడా స్త్రీలకీ, పురుషులకి సమాన హక్కులు మాత్రమే కాక పురుషుల కంటే అధికమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలే స్త్రీలకు ఉన్నాయని తెలుస్తోంది.
అలాగే..
''ఈ అగ్నిహోత్రం నీ లాగే పరమ పవిత్రమైనది'' అని స్త్రీని ప్రశంసిస్తుంది రుగ్వేద సంహిత. ఇక దేవ దానవులు కూడా తమ స్త్రీలను ఆరాధించడం మనం వేదకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. ''ఇంద్రదేవుడు పుష్పఫల భరితమైన వృక్షం లాంటివాడు. వీరులు కూడా రుషుల ద్వారా లభించిన శస్త్రాస్త్రాలతో, సముచితమైన శిక్షణతో సంపూర్ణ శక్తిని సంతరించుకుంటారు. కానీ ఈ శక్తులన్నీ సహజంగానే స్త్రీలో అంతరహితమై ఉంటాయి'' అని స్త్రీని ప్రత్యక్షంగానే ప్రశంసిస్తుంది రుగ్వేద సంహిత.
రుగ్వేదమంతా స్త్రీమయంగా...
రుగ్వేదంలో అసంఖ్యాకమైన రుషీమణుల ప్రసక్తి ఉంది. ఘోషాక్ష, ఘోద, విశ్వావ్ర, అపల, ఉపనిషత్, బ్రహ్మజయ, అతిథి, ఇంద్రాణి, శర్మ, రోమాక్ష, ఊర్వశి, లోపామిత్ర, యామి, శశ్వతి, స్త్రీ, లాక్ష వంటి నారీశిరోమణుల నామధేయాలెన్నో ఉదహరించడం జరిగింది. ఉదాహరణకి భరద్వాజుడి కూతురైన శృతావతి ఆజన్మాంత బ్రహ్మచారిణిగా వుండిపోయి, వేదాలనీ, స్మృతులనీ అధ్యయనం చేసిందని ప్రతీతి. జనక రాజర్షి సీతకి తండ్రి. ఆయన కాలంలో కూడా వివాహితులైన స్త్రీలు వేదాధ్యయనపరులని తెలుస్తోంది. వివాహాలలో కూడా, వరుడు ''ధర్మేచా, అర్ధేచా, కామేచా, నాతిచరామి'' అనడంతో స్త్రీకి వివాహ వ్యవస్థలో ఉన్న సమున్నతమైన స్థానమేమిటో వ్యోతక మవుతోంది.
భీష్మ పితామహుడి కాలంలో కూడా స్త్రీ ఆధిక్యత ప్రస్ఫుటమవుతోంది. అంపశయ్యమీద 58 రోజుల పాటు గడిపిన సమయంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకి సనాతన ధర్మసూత్రాలు వివరిస్తూ, ''ధర్మరాజా! ఏ వంశంలో కూతుళ్ళు, కోడళ్ళు దు:ఖ భాజనులవుతారో, ఆ వంశం సమూలంగా నిర్మూలనమవుతోంది'' అంటాడు. చివరికి, సచ్చంధ మరణాసన్న సమయంలో కూడా ''నిజమైన జ్ఞానం ప్రసాదించే గురువు పదిమంది ఉపాధ్యాయుల పెట్టు. అలాంటి పదిమంది గురువుల కంటే ఒక తండ్రి ఎంతో ముఖ్యమైన వాడు. అలాంటి పదిమంది తండ్రుల కంటే ఒక మాతృదేవత ఎంతో పవిత్రమైనది'' అంటాడు. అలా అగణితమైన అంశాలలో స్త్రీని పరమపవిత్రంగా భావించింది ఈ భరతావని.
సమకాలీన సమాజంలో...
నిజానికి సమకాలీన సమాజంలో ఒకవిధంగా చూస్తే స్త్రీ తనకి తానే ద్రోహం చేసుకుంటుందే మోననిపిస్తోంది. శారీరకమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాల పేరిట, విచ్ఛలవిడితనంతో, వ్యాపారపరమైన మనస్తత్వంతో, ధనాశతో తనని తానే ఒక 'కమోడిటీ'గా మార్చు కుంటోందని విజ్ఞులు కూడా వాపోవడం జరుగుతోంది. ఫ్యాషన్స్ పేరిట, సినిమాల లాలస పేరిట, క్లబ్స్, పబ్స్ మిషతో మహిళ ఒక భోగలాలస వస్తువుగా మారిపోయింది. అయితే పురుషులు స్త్రీకి అన్యాయం చేయడంలేదని కాదు.
చట్టాలలో కూడా...
అసలు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలలో స్త్రీలు విశేషంగా చోటు చేసుకున్న ఈ కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికీ, 'పాస్' కావడానికీ ఇంతకాలం ఎందుకు పట్టిందో అగమ్యగోచరం. ఇలా ఏవో సాంకేతిక కారణాలతో, సాకులతో స్త్రీల సంక్షేమానికి కీలకమైన విషయాలలో కూడా అలక్ష్యం చేయడం క్షమించరాని విషయం.
మహిళా హక్కుల కమిషన్ కూడా...
మనదేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్ వంటి కీలకమైన పదవులు కూడా స్త్రీలు నిర్వహించడం ఎంతో ముదావహమని ప్రపంచమంతా వేనోళ్ళతో పొగడ్తోంది. కాకపోతే సామాజిక స్థాయిలో స్త్రీకి జరుగుతున్న అన్యాయాలని ఎదుర్కొనడానికి మానవ హక్కుల కమిషన్ సరిపోదేమోనని అనుభవజ్ఞుల అభిప్రాయం. ఏంచేతంటే సాధారణంగా ఈ కమీషన్స్ అన్ని మగధీరులైన న్యాయాదీశుల ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతోంది. ఇంత నిష్పక్షపాతంగా వ్యవహరించిన సున్నితమైన, సునిశితమైన స్త్రీల సమస్యలని ఆకళించుకోవడానికి స్త్రీ న్యాయాదీశులే అవసరమని వాళ్ల అభిప్రాయం. కనుక మహిళల సంక్షేమం కోసం పాటుపడే సంఘాలు మహిళా హక్కుల కమిషన్ విషయంలో కూడా పోరాటాలు జరపాలేమోనని అనిపిస్తోంది.
సెలబ్రటీస్‌లో...
శాస్త్ర, విజ్ఞాన, వైద్య రంగాలలో మహిళలు ఎంతగానో పురోగమిస్తున్నారు. ఇక చలనచిత్ర రంగంలో చెప్పనే అక్కర్లేదు. కత్రినాకైఫ్ వంటి హీరోయిన్స్ హీరోల కంటే ఎక్కువగా పారితోషికం పుచ్చుకునే రోజులివి. అసలు ఈ సుసంస్కారం సావిత్రి, వాణిశ్రీ వంటి మహానటీమణులతో తెలుగు చలనచిత్ర సీమలోనే మొదలైందన్న విషయం మనం మరచిపోకూడదు.
రాజకీయ రంగంలో...
రాజకీయ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిపొందిన ఆనాటి ఇందిరాగాంధీ, నేటి సోనియాగాంధీలు నిస్సంశయంగా చరిత్రపుటల్లో నిలిచిపోతారు. అలాగే మయన్మార్‌లో మానవ హక్కుల కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగిస్తున్నా ఆంగ్ సుకీ వంటి మహిళలు కూడా విశ్వ మానవ సమాజానికి ఆదర్శప్రాయులే.
అంచేత మనం 2010 మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్న మనం, పాఠశాలలలో, కళాశాలలలో, విశ్వవిద్యాలయాలలో సాటి విద్యార్థినులను గౌరవించడం, కార్యాలయాలలో ఉద్యోగినులను ఆదరించడం, రాజకీయ రంగంలో స్త్రీలకి కూడా సముచితమైన స్థానాన్ని కల్పించడం, అడుగడుగునా స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలని నివారించడానికి చిత్తశుద్ధితో కృషి చేయడం, చివరికి కుటుంబంలో కూడా స్త్రీలకి సిసలైన ఆస్తిహక్కు కల్పించడం మన కనీస ధర్మమని మరచిపోకూడదు. అప్పుడే, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిజమైన వేడుకగా, పండుగగా, మహోత్సవంగా భాసిల్లుతుంది. - భువనోజ్జ్వల
పోటీ పరీక్షల ప్రత్యేకం
* గ్రూప్-1
1.కాంగో సార్వభౌముడు...2. రవి అస్తమించని సామ్రాజ్యం ఏర్పాటు చేసిన దేశం...3. న్యూక్‌డీల్ విధానం ప్రవేశపెట్టిన అమెరికా అధ్యక్షుడు....4. మహాస్నానవాటిక కనుగొనబడిన ప్రదేశం..5. వందేమాతర ఉద్యమం ప్రారంభించిన సంవక్సరం..6. ప్రపంచంలోని భాషలన్నింటిలో తెలుగుభాష స్ఖానం...7. డెమాస్ అనే పదం ఈ భాషకు చెందినది...8. జాతీయ బాలల విధానం ప్రకటించిన సంవత్సరం...9. అంతర్జాతీయ న్యాయస్థానం గల ప్రదేశం...10. రవాణా నిర్వహణ ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంది...11. ...అనే యూరప్ రాజ్యం ఇండోనేషియా మీద తుదినియంత్రణ సాధించింది12. రష్యా పార్లమెంటును...అంటారు13. నాజీయిజమ్‌కి బైబిల్ వంటిది...14. ప్రచ్ఛన్న యుద్ధం...మరియు...దేశాల మధ్య కొనసాగింది15. భారతీయ వైద్య శాస్త్ర ఆచార్యుడు...16. రిజర్వేషన్లు ...ను పెంపొందించడానికి తోడ్పడతాయి17. డెమోస్ అనగా అర్ధం...18. అకారణంగా అరెస్టు చేసినవారిని విడుదల చేయించడానికి కల్పించిన అవకాశం...19. ఐక్యరాజ్యసమితి పత్రం రూపొందించిన నగరం..20. ఎన్.పి.టి అనగా...21, రైన్ కాన్ఫడరేషన్ ఏర్పాటు చేసినది...22. 1840 సంవత్సరంలో ఆఫ్రికాను అన్వయించిన వారిలో మొదటి వ్యక్తి...23. ఉత్తర రొడీషియాకు ప్రస్తుత పేరు...24. ఆర్యుల కాలంలో జనపదాల సంఖ్య...25. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ఇక్కడ నిర్వహించెను...26. భారత రాజ్యాంగంచే గుర్తించబడిన భాషల సంఖ్య...27. భారతదేశపు అధికార భాష..28. ప్రపంచం పెద్ద ప్రజాస్వామ్య దేశం...29. భూమిపుత్రులు అనే భావన దీనిలో ఒక అంశం...30. బారతదేశం తన మొదటి అణుపరీక్ష నిర్వహించిన సంవత్సరం...31. పనిహక్కు సూత్రాన్ని ప్రతిపాదించింది...32. పెట్టుబడిదారీ రంగంలోని అత్యున్నత దశ..33. స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి యుద్ధం అలాంటిదనే సూత్రాన్ని..ప్రచారం చేశారు34. 1957లో తిరుగుబాటు ప్రారంభమైన ప్రదేశం...35. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనకు కారకులు,..36. భారతీయుడు తన ఓటుహక్కును...వయస్సునుండి పొందుతాడు37. భారతదేశపు ప్రస్తుత ఎన్నికల కమిషనర్...38. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యతాశాతం..39. సార్క్‌కు రూపకల్పన జరిగిన సమావేశ స్థలం...40. ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతమ సభ్యత్వం కల దేశాల సంఖ్య...41. వాటర్లూ యుద్దం జరిగిన సంవత్సరం...42. గ్రేట్ బ్రిటన్‌కు అమెరికాలోని వలసలు...43. మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగిన సంధి...44. ఫాసిస్టు పార్టీ స్థాపకుడు...45. వార్సా సంధిని నిర్వహించిన దేశం..46, వేదాలలో అతిప్రాచీనమైనది...47. ప్రస్తుతం ప్రాథమిక హక్కులు..48. మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం49. భారతదేశ విదేశాంగ విధానానికి ప్రధాన రూపశిల్పి..50. జీబ్రా క్రాసింగ్ వీరి కొరకు
జవాబులు
1. లియోఫోల్డ్-2 2. ఇంగ్లండ్ 3. రూజ్‌వెల్డ్ 4. మొహంజదారో 5. 1905 6. 16వ స్థానం 7. గ్రీకు 8. 1974 9. హేగ్ 10. రవాణా విద్య 11. డచ్ 12. ద్యూమా 13. మెయిన్ కాంఫ్ 14. రష్యా, అమెరికా 15. చరకుడు 15. సామాజిక న్యాయం 17. ప్రజలు 18. హెబియస్ కార్పస్ రిట్ 19. శాన్‌ఫ్రాన్సిస్కో 20. నాన్ ప్రొలిఫిరేషన్ ట్రీట్రీ 21. 10వ చార్లెస్ 22. లివింగ్‌స్టన్ 23. జాంబియా 24. 16 25. దండి 26. 22 27. హిందీ 28. ఇండియా 29. ప్రాంతీయ తత్వం 30. 1974 31. లూయీ బ్లాంక్ 32. సామ్రాజ్యవాదం 33. ముస్సోలిని 34. మీరట్ 35. జనరల్ డయ్యర్ 36. 18 సంవత్సరాలు 37. నవీన్ చావ్లా 38. 65 39. ఢాకా 40. 192 41. 1814 42. 13 43. వర్సయిల్స్ సంధి 44. ముస్సోలిని 45. రష్యా 46. ఋగ్వేదం 47. 6 48. 1884 49. నెహ్రూ 50. పాదచారులకు
1. కుమారీ శతక కర్త
1. అప్పల నృసింహ కవి 2, నరసింహ 3, మరద వెంకయ్య 4. అప్పకవి
2. సూర్యనారాయణ శతక కర్త
1. చౌదరి పురుషోత్తం 2. ఆదిభట్ల 3. విశ్వనాథ 4. జన్నయ మంత్రి
3. కందుకూరి రచించిన రూపకాలెన్ని
1. 12 2. 14 3. 16 4. 18
4. కన్యాశుల్కం ప్రధమ ప్రదర్శన జరిగిన సంవత్సరం
1. 1890 2. 1892 3, 1896 4. 1898
5. కమల పాత్ర గల నాటకం
1. హరిశ్చంద్ర 2. చింతామణి 3. వరవిక్రయం 4. గయోపాఖ్యానం
6. నిజం ఎవరి నాటకం
1. త్రిపురనేని 2. ముద్దుకృష్ణ 3. రావిశాస్త్రి 4. తుమ్మల
7. దొంగాటకం ఎవరి హాస్యనాటిక
1. విశ్వనాథ కవిరాజు 2. ముద్దుకృష్ణ 3. తుమ్మల 4. త్రిపురనేని
8. కుప్పుస్వామి శతకకర్త
1. విశ్వనాథ 2. నార్ల చిరంజీవి 3.త్రిపురనేని 4. తుమ్మల
9. రసము వేయిరెట్లు గొప్పది నవకథాధృతిని మించి అన్న పలుకులెవరివి
1. శ్రీశ్రీ 2. సినారె 3. విశ్వనాథ 4. రావిశాస్త్రి
10. అన్నదమ్ములవలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్..అన్న కవి
1. రాయప్రోలు 2. కందుకూరి 3. గురజాడ 4. చిలకమరి
జవాబులు
1.1 2.2 3.3 4.4 5.2 6.3 7.1 8.3 9.3 10.3
1. క్రిస్టీ వాల్టన్:
ఈవిడ వయసు 54 సం్ప్పలు. ప్రపంచంలో అతిసంపన్నురాలుగా రికార్డు సృష్టించింది. క్రిస్టీ ప్రాపర్టీ 20 బిలియన్ డాలర్స్.
2. ఎలైస్ వాల్టన్:
ప్రపంచంలో రెండవ అతిపెద్ద సంపన్నురాలిగా రికార్డ్ పుటలలో చేరినది. ఈ ఎలైన్‌వాల్టన్. అమె వయసు 59 సం్ప్పలు. ఈమె తండ్రి సామ్, పినతండ్రి జేమ్స్ ఇద్దరూ కలిసి 1962లో బెన్‌టోన్‌విల్లిలో ఒక వాల్‌మార్ట్ జనరల్ స్టోర్స్ స్థాపించారు. ఇపðడు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రిటైలర్స్‌గా నిలబడింది. దీనికి 7,900 బ్రాంచీలు, అందులో పనిచేస్తున్న ఉద్యోగులు 2 మిలియన్ల మంది. ఇక సేల్స్‌లో చూసుకుంటే, 400 బిలియన్ డాలర్లు.
3. లిలియానీ బెట్టెన్‌కోర్ట్:
ఇక మూడవ స్థానాన్ని దక్కించుకున్న ఈవిడ, వయసు 86 సం్ప్పలు. యూరప్‌లో అతి సంపన్నురాలు ఈవిడే. ఈవిడ ఆస్థిపాస్తులు అక్షరాలా 15 బిలియన్ డాలర్లు.
4. సుసన్నే క్టట్టెన్:
జర్మనీకి చేందిన ఈ 46 సం్ప్పల క్లట్టెన్ 12 బిలియన్ డాలర్లతో నాల్గవ స్థానంలో ఉన్నారు.
5. బిర్జిట్ రౌజింగ్:
ఈవిడ స్విట్జర్‌లాండ్‌లో పాకేజింగ్ ఇండిస్టీ చైర్మన్. 85 సం్ప్పల వయసున్న ఈవిడ 11 బిలియన్ డాలర్లకి అధిపతి. ప్రపంచ సంపన్న మహిళల్లో ఐదవ స్థానంలో ఉంది.
6. జాక్విలైన్ మార్స్:
ఈవిడ ఒక చాక్లెట్ తయారీ పరిశ్రమకి అధిపతి. ఈ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద చాక్లెట్ ఉత్పత్తి సంస్థగా రికార్డు సృష్టించింది. ఈమె ఆదాయం 9.5 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం సంపన్న మహిళల లిస్టులో 6 వస్థానంలో ఉన్నారు.
7. అన్నె కాక్స చాంబర్స్:
ఈ లక్కీ 7లో ఉన్న అన్నె వయసు 90 సం్ప్పలు. యునైటెడ్ స్టేట్స్‌లో 'కాక్స కమ్యూనికేషన్స్' పరిశ్రమకి అధినేత. ఈ కంపెనీ కేబుల్స్ తయారీలో ప్రపంచ రికార్డ్‌ని నెలకొల్పింది. ఈవిడ ఆదాయం 9 బిలియన్ డాలర్లు.
8. అభిగాయిల్ జాన్సన్:
ఈ 47 సం్ప్పల వయసున్న జాన్సన్, ఫైనాన్స్ బ ఇన్‌వెస్ట్‌మెంట్స్ కంపెనీ సొంతంగా నడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈవిడ 650 బిలియన్ డాలర్స్‌ల విలువ చేసే 161 ఫండ్స్‌కి కంటికి రెప్పలా పర్యవేక్షిస్తూ వుంటుంది.
9. సావిత్రి జిందాల్:
ఈవిడ 58 సం్ప్పల భారతీయ వనిత. ఈవిడ జిందాల్ గ్రూప్‌కి సంబంధించిన స్టీల్ బ పవర్ కంగ్లోమిరేట్, ఓ.పి.కి నాన్-ఎక్జిక్యూటివ్ ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ప్రపంచ సంపన్న వనితల జాబితాలో 9వ ర్యాంకులో ఉన్నారు. వీరి స్థిర, చర ఆస్తుల విలువ 6 బిలియన్ డాలర్లు.
10. ఛర్లేని డి కార్వల్‌హౌ-హైనెకిన్:
ప్రపంచ ప్రఖ్యాతి వహించిన లండన్‌లోని బ్రెవర్స్ కంపెనీని నడుపుతున్న ఏకైన అధినేత ఛర్లేని. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 170 రకాల ఉత్పత్తుల్ని, 65 దేశాలకి ఎగుమతి చేస్తోందంటే మాటలు కాదు. 54 సం్ప్పల వయసున్న ఛర్లేని ఆదాయం నికరంగా 5.5 బిలియన్ డాలర్లు. ప్రపంచ రికార్డులో ఈవిడ 10 స్థానాన్ని దక్కించుకుంది.
Taken By: దుర్గేష్ పట్టేం
తెలంగాణ ఉద్యమ గేయం:
గేయగతిని తెలంగాణ వైపు మళ్లించి ఒక ఊపును ఇచ్చినవాళ్లు గద్దర్, గూడ అంజయ్య, గోరటి ఎంకన్న, అందేశ్రీ. వారి తర్వాత బైరెడ్డి కృష్ణారెడ్డి, అంబటి వెంకన్న వంటి ఎందరో వాగ్గేయకారులు వచ్చారు. కవి పేరు తెలియకుండా పాటలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. నందిని సిద్ధారెడ్డి రాసిన బతుకమ్మ పాట ఇంటింటా మారుమోగుతున్నది. దేశపతి శ్రీనివాస్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ తెలంగాణ సంస్కృతిని, పోరాట వారసత్వాన్ని పాడుతూనే ఉన్నారు.
తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత తెలంగాణ వాగ్గేయకారులు స్పష్టమైన ఎరుకతో తెంలగాణను తమ పాటల్లో వస్తువుగా ఎంచుకున్నారు. గద్దర్ ఎన్నో పాటలు రాసి భువనగిరి, వరంగల్ సభలను ఉర్రూతలూగించారు. తెలంగాణ పల్లెల విధ్వంసాన్ని, రాజ్యహింసను ఆయన తన పాటల్లో ప్రతిబింబించారు. గూడ అంజయ్య మరింత నిర్దిష్టంగా తెలంగాణను గానం చేశారు. ఆర్థికంగా, అంతకన్నా ముఖ్యంగా సామాజికంగా, సాంస్కృతికంగా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందనే భావన తెలంగాణ సాహిత్యకారులను ఆవహించింది. తమ చారిత్రక ఆనవాళ్లు అంతర్జాతీయ వలసవాదుల వల్లనే కాదు, అంతర్గత వలసవాదుల వల్ల కూడా రూపుమాసిపోయే ప్రమాదం ముంచుకొచ్చిందనే ఎరుక వారిని శోకాలు పెట్టించింది. ఈ శోకతీవ్రతను పాట కూడా ప్రతిబింబించి, దాన్ని అధిగమించి పోరాట స్ఫూర్తిని అందిస్తున్నది. ఆ శోకతీవ్రత తెలంగాణ పాటన సాంద్రతను, ప్రేక్షకులను తనదైన లోకంలోకి తీసుకెళ్లి గుండెలు కదిలించే గుణాన్ని సంతరించుకుంది. అంతకు ముందు గుర్తించాల్సిన అవసరం లేదనుకున్న ఎన్నో విషయాలు పాటలో భాగమయ్యాయి. కేవలం విప్లవ సంప్రదాయం మాత్రమే కాదు, ఆ సంప్రదాయానికి కూడా కారణమైన చారిత్రక, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక అస్తిత్వం, తెలంగాణ చైతన్యం ముందుకు వచ్చింది. దీంతో తెలంగాణ ఉద్యమ పాటకు అనేక పార్శ్వాలు వచ్చి చేరాయి. పోరు తెలంగాణ, నా ఊరు తెలంగాణ అనేది ఒకటే కాదు, నిరంతరంగా ఈ పోరు చేయాల్సిన స్థితి తెలంగాణకు కలగడానికి గల అనేకాంశాలను తెలంగాణ పాట తడిమే ప్రయత్నం చేసింది. అదే పోరును తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేస్తామనే, పోరాట సంప్రదాయాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని తెలంగాణ పాట స్పష్టం చేసింది.
వ్యక్తీకరణలో గత విప్లవ గేయాల శైలిని గోరటి వెంకన్న, అందెశ్రీ పూర్తిగా మార్చి వేశారు. గద్దర్, గూడ అంజయ్య వంటి వారి గేయాల్లో విప్లవ బాణీలే వస్తువు మార్చుకుని తెలంగాణ గేయాలుగా రూపు కడితే వీరి పాటలు అభివ్యక్తి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఈ ప్ర్తత్యేకత వల్లనే గద్దర్, గూడ అంజయ్య వంటి ఉద్ధండులుండగానే వీరి పాటలకు ప్రత్యేక గుర్తింపు, ఆదరణ లభిస్తున్నాయి. గోరటి ఎంకన్న పాటల్లో బైరాగుల తత్వాల్లోని, యక్షగాన రీతుల్లోని లక్షణాలు కనిపిస్తే, అందేశ్రీ పాటల్లో పద్యనాటక లక్షణాలు కనిపిస్తుంది.
Taken By : దుర్గేష్ పట్టేం